akkineni nagarjuna reaction on fire accident at annapurna studios

Annapurna Studios: Nagarjuna: హైదరాబాద్ లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఈ ఉదయం కృష్ణానగర్ వద్ద ఉన్న అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. బాధపడాల్సిన పనేం లేదు” అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాగార్జున.

మరోవైపు అంతకుముందే ఈ అగ్ని ప్రమాద వార్తలపై అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజ్‌మెంట్ కూడా అధికారికంగా స్పందించారు. స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. దయచేసి అగ్నిప్రమాద వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండండి’ అంటూ అభ్యర్థించారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులు సద్దుమణిగాయని అంటున్నారు.