గేరు మార్చిన సమంత…రియాలిటీ షోలో..!

0
317
akkineni samantha will entertain with reality show in allu arjun aha ott

Samantha Akkinen: పెళ్లి తర్వాత కూడా రెగ్యులర్‌గా వెండితెరపై అలరిస్తూ ట్రెండ్‌కి తగ్గట్టుగా ముందుకు సాగుతోంది సమంత. ఈ మేరకు ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పి కెమెరాల ముందు కదులుతున్న సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఆమె కోసం అల్లు అరవింద్ పక్కా ప్లాన్ చేశారని టాక్.

నిర్మాత అల్లు అర‌వింద్ సొంతంగా `ఆహా` పేరుతో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ని ఇటీవ‌ల ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. ఈ మేరకు ఓ రియాలిటీ షోని ప్లాన్ చేసిన అల్లు అర‌వింద్.. దానికి హోస్ట్‌గా చేసేందుకు గాను సమంతను ఒప్పించారట.

ఆమె చేయబోయే ఈ షో కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారట అల్లు అరవింద్. మరోవైపు ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి అరచేతిలో ఆటలాడుతూ మెప్పించడానికి ఇదే బెస్ట్ రూట్ అని ఫిక్సయిన సామ్.. ఈ మేరకు స‌మంత‌కు భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాక్. దీంతో అక్కినేని కోడలు కూడా వెంటనే సై అనేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపనున్నారు.

Previous articlechiranjeevi vedalam remake will start on 16 november
Next articleSamantha Akkineni reality show on Aha OTT