akshay kumar laxmmi bomb trailer released

Laxmmi bomb Trailer: తెలుగు ప్రేక్షకులను ‘కాంచన’ పేరుతో భయపెట్టిన రాఘవ లారెన్స్.. ఇక బాలీవుడ్ ఆడియన్స్‌కి వణుకు పుట్టించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కాంచన సినిమాను ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసిన ఆయన తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ – కైరా అద్వానీ జంటగా నటించిన కామెడీ హార్రర్ చిత్రం ”లక్ష్మీ బాంబ్”. కొరియోగ్రాఫర్ గా నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

హీరో పాత్రతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా రెండు పాత్రల్లో అక్షయ్ కుమార్ నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అక్షయ్ నటన ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టడం ఖాయం అనిపిస్తోంది. హిందీలో లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా ఇదే. కాంచన సిరీస్ నచ్చి ఈ సినిమా రీమేక్ బాధ్యతలు స్వయంగా అక్షయ్ కుమార్ తీసుకోవడం విశేషం. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. అయితే ఇప్పుడు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దీపావళి కానుకగా నవంబర్ 9న ‘లక్ష్మీ బాంబ్’ విడుదల చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ – ఫాక్స్ స్టార్ స్టూడియోస్ – షబీనా ఎంటర్టైన్మెంట్ – తుషార్ ఎంటర్టైన్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సినిమాల్లో భారీ బడ్జెట్ మూవీ ‘లక్ష్మీబాంబ్’ అని చెప్పవచ్చు.