Akshay Kumar look from Suryavanshi goes viral on social media
Akshay Kumar look from Suryavanshi goes viral on social media

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఇండియన్ మూవీ మిషన్ అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే అక్షయ్ కుమార్, ఇప్పటికే కేసరి, మిషన్ మంగళ్ చిత్రాలను ఈ ఏడాది విడుదల చేశాడు. అలాగే ఈనెల 25న హౌస్ ఫుల్ 4 చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన అక్షయ్.. ప్రస్తుతం గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్ చిత్రాలలో నటిస్తున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మిస్తున్న సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ కుమార్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో విశేషం ఏమిటంటే రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. గతంలో రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ తో సింగం చిత్రం చేశారు అలాగే, రణ్ వీర్ తో సింబా మూవీ చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలలోని హీరో పాత్రలు భాజీ రావ్ సింగం, సంగ్రామ్ భాలే రావ్. ఈ పాత్రలలో రణ్ వీర్, అజయ్ మళ్ళీ చేస్తున్నారు. కాగా వీరు ముగ్గురు పోలీస్ గెటప్స్ లో దిగిన ఫోటోని రీసెంట్ గా అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. ఇక అక్షయ్ సరసన కత్రినా ఖైఫ్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కానుంది.