‘అల వైకుంఠపురములో’ క్లోజింగ్ కలెక్షన్స్.!

2611
ala vaikunthapuramulo world wide closing box office collection

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. గత నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపి కొత్త ఇండస్ట్రీ రికార్డును సెట్ చేశారు. సంక్రాంతికి విడుదలైన అల.. సినిమా క్లోజింగ్ బిజినెస్ చూస్తే ఇదే అవగతమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బన్నీ, త్రివిక్రమ్ లకు హ్యాట్రిక్ హిట్ ను అందించింది.

అల.. వైకుంఠపురములో వరల్డ్ వైడ్ క్లోజింగ్ బిజినెస్ దాదాపు 163 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 132 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. నైజాంలో 44కోట్లు వరకూ వసూలు చేసిందంటున్నారు. యూఎస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 256.36 కోట్లను కొల్లగొట్టింది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లను వసూల్ చేయడం అంటే మాటలు కాదు. సినిమా విజయంలో కీలక పాత్ర పాటలదే. తమన్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. మూడు నెలల ముందు నుంచే పాటలను ప్రేక్షకులకు ఎక్కించేసి సినిమాలో కూడా అదే టెంపో మెయింటైన్ చేయడంతో సినిమా ఎక్కడా ఆగలేదు.

నైజాం 44.88 cr
సీడెడ్ 18.27 cr
ఉత్తరాంధ్ర 19.93 cr
ఈస్ట్ 11.44 cr
వెస్ట్ 8.96 cr
కృష్ణా 10.79 cr
గుంటూరు 11.18 cr
నెల్లూరు 4.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.85 cr
ఓవర్సీస్ 18.35 cr
వరల్డ్ వైడ్ టోటల్ 160.37 cr (share)