ప్రభాస్ – హేష్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన బన్నీ…!

0
317
Ala Vaikunthapurramuloo sets an all-time high TRP record

అల్లు అర్జున్ నటించిన చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం సాధించిందో అందరికి తెల్సిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని హాసిని అండ్ హారిక క్రియేషన్స్ మరియు గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుశాంత్ – నివేద పేతురాజ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు.

త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, తమన్ సంగీతం ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఇండస్ట్రీ లోనే అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలచింది ఈ సినిమా…ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రం టీవీలో ప్రసారం అయింది.. బుల్లితెర పైన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్‌ చేసింది.

ఆగస్టు 16న జెమినీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం 29.4 టీఆర్పీ రేటింగ్ ని సాధించింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన జనాలు ‘అల..’ని స్మాల్ స్క్రీన్ పై టాప్ లో నిలబెట్టారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలై 7 నెలలు అవుతోంది. ఓటీటీలో విడుదలై 6 నెలలు అవుతోంది. అయినప్పటికీ టీవీలో 29.4 రేటింగ్స్‌ సాధించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇంత రేటింగ్ రాలేదు.

Allu Arjun's Ala Vaikunthapurramuloo sets highest TRP record

దీంతో ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ 23.4 టీఆర్పీని బ్రేక్ చేసినట్లయింది. అయితే టీఆర్పీ రేటింగ్స్ లో బన్నీ పైచేయి సాధించాడని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత ‘బాహుబలి – 2’ 22.7 టీఆర్పీతో మూడో స్థానంలో ఉండగా ‘శ్రీమంతుడు’ 22.54 టీఆర్పీతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.+

Previous articleAnushka Sharma, Virat Kohli announce pregnancy
Next articleAllu Arjun Break Prabhas and Mahesh All Time Record