Alia Bhatt and an injured Ranbir Kapoor snapped at the airport..
Alia Bhatt and an injured Ranbir Kapoor snapped at the airport..

రణ్ బీర్ కపూర్.. ఎంతో మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఆలియా భట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి ఓకె చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఏ ఫంక్షన్ కు వెళ్లినా కలిసే వెళ్లేవారు. వీళ్ళను తొలిసారి వెండితెర మీద చూడాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. వీరిద్దరూ తొలిసారిగా బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను చాలా రోజులుగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు మనాలీలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో ముంబై నుండి వాళ్ళు మనాలీ వెళ్ళడానికి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. రణబీర్ మాత్రం భుజం నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బ్యాండేజ్ తో కనిపించాడు రణ్ బీర్. ఆదివారం నాడు ఫుట్ బాల్ ఆడుతుండగా రణ్ బీర్ గాయపడినట్లు తెలుస్తోంది. అయినా ఆ నొప్పితోనే రణ్ బీర్ బయలుదేరాడు. మొత్తం 15 రోజుల పాటూ బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ జరగనుంది. అయితే ఓ రెండు రోజులు రణ్ బీర్ కు రెస్ట్ టైమ్ ఇచ్చి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. మొదట్లోనే యాక్షన్ సీన్స్ షూటింగ్ చేయనివ్వకుండా చూడాలని కూడా చిత్ర బృందం షెడ్యూల్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం వైద్యులు రణ్ బీర్ కు రెస్ట్ అవసరమని సూచించినా వినకుండా షూటింగ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా కేమియో చేయనున్నారని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌని రాయ్ లు పలు పాత్రల్లో కనిపించనున్నారు. 2020 వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.