RRR షూట్‌‌లో ఆలియా భట్..అంతా సిద్ధం చేసిన రాజమౌళి

381
Alia Bhatt finally joins team RRR for shooting in Hyderabad

మెగా పవర్​స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహబలేశ్వరంలో జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌‌లో ఆలియా జాయిన్ అయింది. దీనికి సంబంధించి తన ఇన్‌‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌‌లో ఓ ఫొటో షేర్ చేసింది.

ఈ మూవీలో ఆలియాను ఎంపిక చేసి దాదాపు ఏడాది కావడం గమనార్హం. ఈరోజు సాయంత్రం ఆమె కాస్ట్యూమ్ ట్రయల్స్ కూడా జరగబోతున్నాయి. ఒకసారి రామ్ చరణ్ గాయం కారణంగా మరియు రెండవ సారి, లాక్డౌన్ కారణంగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ చేరిక వాయిదా పడింది. చివరగా, ఆమె జట్టులో చేరుతోంది. ఈ చిత్రంలో సీత అనే పాత్రలో రామ్ చరణ్ సరసన ఆమె కనిపించనుంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్‌‌లో చేరిపోయానంటూ ఆలియా ఫొటో షేర్ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో ఆలియా పరిచయం కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, తారక్.. కొమురం భీమ్​గా అలరించనున్నారు. హాలీవుడ్ నటి ఒలివియా.. తారక్ సరసన నటిస్తోంది. అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.