Alia Bhatt finds South star Vijay Devarakonda very glamorous
Alia Bhatt finds South star Vijay Devarakonda very glamorous

విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో మనోడి స్టైల్ కు అందరూ ఫ్యాన్స్ అయ్యారు. విజయ్ దేవరకొండ ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లో అయినట్లు కనిపిస్తున్నా.. పాపులారిటీ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా మనోడి గురించి తెగ మాట్లాడేసుకుంటూ ఉన్నారు.

ఇప్పటికే కియారా అద్వానీ, జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ కు ఫ్లాట్ అయిపోయారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆలియా భట్ కూడా చేరింది. ఓ అవార్డు ఫంక్షన్ లో ఆలియా భట్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన స్టైలిష్‌ స్టార్‌లలో అమితాబ్‌ బచ్చన్‌తో పాటు విజయ్‌ దేవరకొండ అని చెప్పుకొచ్చింది. విజయ్‌ స్టైల్‌ అద్భుతంగా ఉంటుందని తెలిపింది. విజయ్ దేవరకొండ-ఆలియా భట్ కలిసి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కలిసి పాల్గొన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇంట్లో పార్టీలకు కూడా విజయ్ దేవరకొండ చాలా సార్లు అటెండ్ అయ్యాడు. మనోడి విభిన్న గెటప్ లు చూసి ఆలియా కూడా ఫ్యాన్ అయిపొయింది. ప్రస్తుతం ఆలియా భట్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన నటిస్తోంది.. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా ఆలియా ముఖ్య పాత్రను పోషిస్తోంది.

ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండ కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కొత్త ఇంట్లోకి అడుగుపెడుతూ గృహ ప్రవేశం జరిగిందని.. తన కుటుంబసభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నామంటూ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విజయ్ దేవరకొండ తన ఇంటి కోసం భారీగా ఖర్చు చేశాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అన్ని సదుపాయాలూ ఉన్న పెద్ద విలాసవంతమైన ఇంటిని కొన్ని కోట్లు ఖర్చు చేసి కట్టించుకున్నారని చెబుతున్నారు. 15 నుంచి 20 కోట్లు పెట్టి కొన్నట్టు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా.. ఎంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఇల్లు. విజయ్ కు నచ్చినట్లు ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నట్లు కూడా తెలిసిపోయింది.

విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా లాంటి సినిమా హిట్లు స్టార్ ను చేశాయి. నోటా, డియర్ కామ్రేడ్ నిరాశపరిచినా అతనికి ఉన్న స్టార్డమ్ అలాగే కొనసాగుతోంది. వరల్డ్ గ్రేటెస్ట్ లవర్, హీరో సినిమాలు విడుదలకు రెఢీగా ఉన్నాయి. మన రౌడీ అతి త్వరలో బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.