RRR: ఆలియా భట్ సీతగా ట్రెడిషనల్ లుక్‌లో హీరోయిన్

116
Alia Bhatt First Look poster Released from RRR Movie

RRR మూవీకి లో సీత గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఇందులో ఆమె కు సంబంధించిన లుక్ ఈ రోజే విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి. ఈ మూవీలో ‘సీత’గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

టాలీవుడ్ తెరపై తొలిసారి కనిపించబోతున్న ఆలియా.. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేసింది. అల్లూరి రామరాజు ప్రేమించిన అమ్మాయి సీతగా ఆలియా నటిస్తోంది. ముందుగా రాముని విగ్రహం ముందు సిలౌట్ లో రివీలైన ఆలియా లుక్ పై ఆసక్తి నెలకొంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా అత్యంత భారీ బట్జెట్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.

తండ్రి మహేష్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ RRR మూవీ రూపొందిస్తున్నారు జక్కన్న. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ .. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

SS Rajamouli gifts Alia Bhatt's RRR first look poster to fans on her birthday