ఎన్టీఆర్, శివ #NTR30 సినిమాపై లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

0
2844
ALia Bhatt Lead Role In NTR next with koratala Siva NTR 30

Jr NTR – Koratala Siva #NTR30: ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా ఆక్టోబరులో మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం ఆలియాను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం.

ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు రూ. 4.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

ALia Bhatt Lead Role In NTR next with koratala Siva NTR 30

Also Read: రివ్యూ: గల్లీరౌడీ 

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత తారక్‌-శివ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్‌ మునుపెన్నడూ లేనివిధంగా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసారు కొరటాల శివ.

Also Read: రివ్యూ: నితిన్‌ మాస్ట్రో

 

Previous articleరివ్యూ: గల్లీరౌడీ
Next articleదేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..!