‘ఆర్ఆర్ఆర్’ లో పాట పాడనున్న అలియా భట్

370
alia-bhatt-to-sing-her-own-song-in-rrr
alia-bhatt-to-sing-her-own-song-in-rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని వేచిచూసేలా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో తారక్ కొమరంభీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

ఈ క్రమంలో రాజమౌళి కోరికపై ‘ఆర్ఆర్ఆర్’ కి అలియా ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను ఆమెపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అయితే ఇతర భాషలు కాకుండా ఈ పాట హిందీ వెర్షన్‌ను మాత్రమే ఆలియా ఆలపిస్తుందట.

 

 

బాలీవుడ్ నటి అలియా భట్ మంచి సింగర్ కూడా అన్న సంగతి బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. గతంలో ఆమె ‘హైవే’, ‘హంటీ శర్మా కీ దుల్హనియా’ వంటి సినిమాలో పాటలు పాడి సింగర్ గా కూడా అలరించింది.