RRR: ఆలియా లుక్‌పై లేటెస్ట్ అప్‌డేట్

228
Alia Bhatt's first look as Sita in SS Rajamouli's RRR

రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా RRR. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ భారీ ప్రాజెక్టుపై పడ్డాయి. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో RRRకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నారు జక్కన్న. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ ఆలియా భట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం కాల్పనిక గాథ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్.. కొమురం భీం పాత్రలో కనిపించి సందడి చేయనుండగా, రామ్ చరణ్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయనున్నారు. కాగా, అలియా భట్‌.. గంగూభాయ్ కంతియావాడి అనే చిత్రంలోను నటిస్తుండగా, ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ‘సీత’ పాత్ర పోషిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ పోస్టర్ రిలీజ్ కానుందని తెలుపుతూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది చూసి ఆలియా లుక్ కోసం వెయిటింగ్ ఇక్కడ అంటూ మెగా, నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.