Cine workers demand to Adipurush Ban: ఎన్నో భారీ అంచనాల మధ్య పురాణపురుషుడు అయినటువంటి రాముడి ఇతివృత్తాన్ని తెరకెక్కించాము అని చెప్పి విడుదల చేసిన చిత్రం ఆదిపురుష్. రామాయణంలోని ఎన్నో సంఘటనలను మరియు సన్నివేశాలను తమకు ఇష్టం వచ్చినట్లుగా మార్చడమే కాకుండా ఒక మహాకావ్యాన్ని అభ్యంతరకరంగా చిత్రీకరించారు అని ఈ చిత్రం విడుదలైన తర్వాత పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి.
Cine workers demand to Adipurush Ban: అయితే ప్రస్తుతం ఈ చిత్రం స్క్రీనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ మోదీ కి లేఖ రాసింది. అలాగే థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయడానికి వీలు లేకుండా చేయవలసిందిగా వారు మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాముడు ,హనుమంతుడు పాత్రల యొక్క గౌరవ ప్రతిష్టలు కించపరిచే విధంగా స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ఉన్నాయని వాళ్ళు పేర్కొన్నారు.
హిందూ మత సనాతన ధర్మ సాంప్రదాయాలను మరియు నమ్మకాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమాను నిర్మించాలని వారు ఆరోపించారు. కులమతాలకు అతీతంగా దేశంలో ప్రతి ఒక్కరు ఆరాధించే దేవతలను రాముడు అలాగే హనుమంతుడు ఉన్నారు . అటువంటి వ్యక్తులను వీడియో గేమ్ లోని క్యారెక్టర్ల లాగా సృష్టించడమే కాకుండా.. హనుమంతుడి చేత మాస్ డైలాగ్స్ చెప్పించారు అని వాపోతున్నారు.
దానితోపాటుగా చిత్రంలో సీతాదేవిని అపహరించినప్పుడు రావణాసురుడు పుష్పక విమానంలో తీసుకువెళ్లినట్టు ఉన్న మన పురాణాలని మార్చి ఓ భయంకరమైన గబ్బిలం ఆకారం మీద సీతమ్మవారిని అపహరించినట్లుగా వికృతంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలను హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్, సినిమాకి పనిచేసిన రైటర్స్ మరియు ప్రొడ్యూసర్లపై కేసు పెట్టాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది.

ప్రస్తుతం మోదీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమోషన్స్ కంటే అనవసరమైన గ్రాఫిక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిన దెయ్యాలు భూతాలు లాంటి క్యారెక్టర్ లను రావణుడి సైన్యాన్ని గా చూపించడం పై నెటిజన్లో ఈ చిత్రాన్ని విపరీతంగా ట్రోల్ చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.