all set to actor nithin love marriage april 2019 2020
all set to actor nithin love marriage april 2019 2020

యూత్ స్టార్ నితిన్.. పెళ్ళి చేసుకోబోతున్నాడా.. అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. అది కూడా ప్రేమ వివాహం తో..ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ డైరెక్షన్లో భీష్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా..ఈ సినిమా రిలీజ్ కాగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. 2020 లోనే ఈ మూడు చిత్రాలు విడుదల కాబోతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా ఓ అమ్మాయితో నితిన్ ప్రేమలో ఉన్నాడట. ఆమెకు ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తుంది.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త బయటికి రాగానే ఆయన ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ జంట ఒకటికాబోతున్నారు. మరి ఆ లక్కీ గర్ల్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం ఆమె తాలూకా వివరాలు మాత్రం చాల రహస్యం గా ఉంచారు. డైరెక్ట్ గా పెళ్లి సమయంలోనే ఆమె వివరాలు చెపుతారా..లేక అంతకంటే ముందే చెపుతారా అనేది చూడాలి. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉన్నది నితిన్ క్లారిటీ ఇస్తేనే కానీ చెప్పలేం అని కొంతమంది ఫిలిం విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి పెళ్ళి వార్త పై నితిన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి మరి..!