Homeసినిమా వార్తలుAllari Naresh: అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నా స్వామి రంగా టీం

Allari Naresh: అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నా స్వామి రంగా టీం

Allari Naresh As ‘Anji’ first look from Nagarjuna starring Naa Saami Ranga movie. Naa Saami Ranga shooting update, Naa Saami Ranga Release Date, cast crew details

Allari Naresh First look From Naa Saami Ranga: అక్కినేని నాగార్జున నా స్వామి రంగా అనే సినిమాతో జనవరి 13న మన ముందుకు రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట కూడా సినిమాపై భారీగానే అంచనాలు పెరిగేటట్టు చేశాయి.. దానితోపాటు ఈరోజు సినిమా నుండి అల్లరి నరేష్ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది..

Allari Naresh First look From Naa Saami Ranga: ఈ సినిమాకి కొత్త దర్శకుడు విజయ్ పిన్ని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే తన క్యారెక్టర్ నేమ్ వచ్చేటప్పటికి అంజి అన్ని పోస్టర్ పై కూడా వేశారు. లోపల చొక్కాతో లుంగీ మరియు గళ్ల చొక్కాలో స్టైలిస్ట్ గా నడుస్తున్న అల్లరి నరేష్ ని పోస్టర్లో మనం చూడవచ్చు..ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వస్తున్నా నా స్వామి రంగ సినిమాలో అల్లరి నరేష్ పాత్రకు సంబంధించిన వీడియోని రేపు 10 గంటలకు విడుదల చేయుటకు మేకర్స్ సిద్ధం చేయడం జరిగింది.

సినిమాలో మిగతా తారాగణానికి సంబంధించిన పోస్టర్లు కూడా రాబోయే రోజుల్లో విడుదల చేయబోతున్నారు.. అలాగే నా స్వామి రంగా సంబంధించిన టీజర్ (Naa Saami Ranga Teaser) ని ఈనెల 16న బిగ్బాస్ షోలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌కు చెందిన అభిరుచి గల నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2024 సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.

Allari Naresh As ‘Anji’ first look from Nagarjuna starring Naa Saami Ranga movie. Naa Saami Ranga shooting update, Naa Saami Ranga Release Date, cast crew details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY