‘ఆహా’లో అల్లరి నరేష్ నాంది సినిమా

193
allari-naresh-naandhi-movie-on-aha
allari-naresh-naandhi-movie-on-aha

అల్లరి నరేష్ విలక్షణ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరోడికి ఇది 57వ సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కినది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా  తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

 

 

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీ సంస్థ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.