హిందీలో రేమేక్ అవ్వబోతున్న ‘నాంది’ సినిమా

272
allari-naresh-naandhi-movie-to-be-remake-in-hindi
allari-naresh-naandhi-movie-to-be-remake-in-hindi

టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. కానీ కొన్నాళ్లుగా నరేష్ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నారు. అటువంటి సమయంలో నాంది అవకాశం అతడి చెంతకు చేరింది. ఎప్పుడు కామెడీగా చేసే నరేష్ ఈ సినిమాలో పక్కా సీరియస్ పాత్రలో కనిపించారు.

 

 

ముఖంపై ఇసుమంత నవ్వు కూడా లేకుండా నరేష్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఎట్టకేలకు ఈ సినిమాతో నరేష్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. సినిమాకు రెస్పాన్స్‌ కూడా అదే స్థాయిలో వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నాంది సినిమాను హిందీలో రేమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంట.

 

 

ఈమేరకు వార్తలు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెగ వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాంది హింది రీమేక్ విషయంలో చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ రీమేక్ గురించి క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.