అల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమా ట్రైలర్

0
191
allari-naresh-naandhi-trailer
allari-naresh-naandhi-trailer

కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమాతో వస్తున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు ఉదయం మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసారు ఈ ట్రైలర్ చూస్తుంటే అనుకోకుండా ఓ మర్డర్ కేసు లో ఇర్రుకోని జస్టిస్ కోసం పోరాడుతున్న వ్యక్తి గా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు .

 

 

 

ప్రయోగాత్మక చిత్రాల‌తో ఆక‌ట్టుకునే న‌రేష్ ఇపుడు ‘నాంది’ డిఫ‌రెంట్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. టీజర్ లోను నరేష్ చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తిని నెలకొల్పాయి. నాంది సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక అంశాలపై మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయట. క్లైమాక్స్లో అయితే నరేష్ నటన అద్భుతంగా ఉంటుందని టాక్ వస్తోంది.