అల్లరి నరేశ్ హీరోగా ‘స‌భ‌కు న‌మ‌స్కారం’ టైటిల్ లుక్ పోస్ట‌ర్‌

Sabhaku Namaskaram: ఈ ఏడాది ‘నాంది’తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి, విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు, విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్న అల్ల‌రి న‌రేశ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న చిత్రానికి ‘స‌భ‌కు న‌మ‌స్కారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. న‌రేశ్ పుట్టిన‌రోజు(జూన్‌30) సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స‌తీశ్ మ‌ల్లంపాటి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. న‌రేశ్ 58వ చిత్ర‌మిది.

న‌రేశ్ స్జేజ్‌పై మైక్ ముందు నిల‌బ‌డి చేతులెత్తి దండం పెడుతున్న ఈ పోస్ట‌ర్‌లో ఓ వైపు జేబులో నోట్ల క‌ట్ట‌లు, మ‌రోవైపు జేబులో మందు సీసాను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎన్నికల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే రాజ‌కీయ నాయ‌కుల శైలిని విమ‌ర్శించే త‌ర‌హాలో పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘స‌భ‌కు న‌మ‌స్కారం’ రూపొంద‌నుంద‌ని పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి జోనర్‌లో న‌రేశ్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి.

ప‌దునైన సంభాష‌ణ‌ల‌తో రైట‌ర్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రైట‌ర్ అబ్బూరి ర‌వి ఈ సినిమాకు మాటలను అందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ రెండో వారాంతంలో షూటింగ్ మొద‌లుకానున్న ఈ సినిమాలోని ఇత‌ర నటీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Related Articles

Telugu Articles

Movie Articles