Allari Naresh About Ugram Movie: అల్లరి మూవీతో తెలుగు తెరకు పరిచయమై తన అల్లరితో అందరిని నవ్వించి చివరికి అల్లరి నరేష్ గా గుర్తుతెచ్చుకున్న యాక్టర్ ఇవివి సత్యనారాయణ కొడుకు నరేష్. మంచి కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కమర్షియల్ చిత్రాలతో హిట్లను తన ఖాతాలో వేసుకున్న నరేష్ గత కొద్ది కాలంగా ఫ్లాపులతో సతమతమయ్యాడు. కామెడీ యాంగిల్ రూటు మార్చి ఇప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
Allari Naresh About Ugram Movie: మంచి పవర్ఫుల్ రోడ్ లో నరేష్ నటించిన యాక్షన్ చిత్రం ఉగ్రం. మే 5 న సమ్మర్ ట్రీట్ గా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.మిర్నా , అల్లరి నరేష్ జంటగా విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ నందు గ్రాండ్ గా జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన అల్లరి నరేష్ (Allari Naresh) యూనిట్ మొత్తం చిత్రం కోసం రోజుకు 17 గంటల పైగా కష్టపడింది. అని తెలిపారు. అందరి యొక్క సమిష్ట కృషితోనే ఉగ్రం మూవీ తెరకెక్కిందని ఆయన అన్నారు. అంతేకాకుండా డైరెక్టర్ విజయ్ తో పనిచేయడం నిజంగా తనకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని నరేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తనలోని ఓ మంచి కామెడీ మరియు యాక్షన్ యాంగిల్ ని చూశారని ఈ చిత్రం ద్వారా మాత్రం ఉగ్రరూపాన్ని చూడబోతున్నారని నరేష్ అన్నాడు.
ఈ మూవీ ద్వారా నరేష్ (Allari Naresh) తొలిసారిగా మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో పోలీస్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది కంప్లీట్ గా కామెడీ యాంగిల్ తో నిండి ఉండేది కానీ ఇందులో నరేష్ను కాప్ గా చూడడం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అట. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ట్రైలర్ అన్ని ఆకట్టుకునే విధంగా ఉండడంతోపాటు చిత్రంపై భారీ స్థాయి అంచనాలను కూడా పెంచాయి. ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విజయ్ కనకమెడల ఇంతకుముందు నరేష్ తో కలిసి నాంది మూవీ చేశారు.