సరికొత్త పాత్రలో అల్లరి నరేష్!

allari naresh upcoming telugu movies 2020, release dates
allari naresh upcoming telugu movies 2020, release dates

టాలీవుడ్ లో ప్రముఖ హాస్య దర్శకులు జంద్యాల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు ఈవివి సత్యనారాయణ. ఎన్నో కామెడీ సినిమాలు తెరకెక్కించి తన మార్క్ చాటుకున్నారు. ఆయన తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా.. అల్లరి నరేష్ ఒక్కరే కామెడీ హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కించిన ‘అల్లరి’ మూవీతో వెండి తెరకు పరిచయం అయిన నరేష్ ఆ సినిమా టైటిల్ తన ఇంటిపేరుగా మల్చుకున్నారు.

ఇటీవల సునీల్ తో కలిసి నటించారు. గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ మూవీలో కీలక పాత్రలో నటించాడు. కెరీర్ బిగినింగ్ లో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన నరేష్ అతి తర్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. కానీ ఈ మద్య ఈ అల్లరోడికి అస్సలు కలిసి రావడం లేదు. దాంతో సినిమా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ‘బంగారు బుల్లోడు’ సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ మొదటి చిత్రంగా అల్లరి నరేష్ హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈనెల 20వ తేదీన రామానాయుడు స్టూడియో నందు ఉదయం 9:44 నిమిషాలకు మూవీ ప్రారంభ కార్యక్రమం కలదు. ఐతే ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అల్లరి నరేష్ లుక్ తన గత ఇమేజ్ కి భిన్నంగా చాల వైవిధ్యంగా ఉంది. ఎరుపెక్కిన కళ్ళు, ముఖం నిండా గాయాలతో ఉన్న నరేష్ సీరియస్ కంటెంట్ మూవీతో వస్తున్నాడు అనిపిస్తుంది. కెరియర్ పరంగా ‘అల్లరి నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.