మెగాస్టార్ అభిమానులకు సారీ చెప్పిన ‘ఆహా’ టీమ్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ యాప్‌ ‘ఆహా’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంతను రంగంలోకి దింపి ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి లాంటి క్రేజీ హీరోలను తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వారు చెప్పే విశేషాల కోసం ప్రేక్షకులు ఆ షోను చూస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు హాజరై ఎన్నో సంగతులు పంచుకున్నారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎపిసోడ్ ని జనవరి 1న ప్రసారం చేయబోతున్నారు.ఈ ఎపిసోడ్ ప్రచారంలో భాగంగా బన్నీని మెగాస్టార్ అని సంభోదించారు. ‘మెగాస్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎపిసోడ్’ అంటూ సోషల్ మీడియాలో అతి చేశారు. బన్నీని అందరూ స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే ఈ ప్రోమోలో అల్లు అర్జున్‌కి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదును చేర్చడం వివాదాస్పదమైంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే చిరంజీవి ఒక్కరేనని, అల్లు అర్జున్ పేరు ముందర ఆ బిరుదును ఎందుకు చేర్చారంటూ మెగా అభిమానులు ‘ఆహా’ నిర్వాహకులపై మండిపడ్డారు. కావాలనే ఇలా చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ వివాదాన్ని వెంటనే గుర్తించిన ‘ఆహా’ టీమ్ తన తప్పును సరిదిద్దుకుంది. వెంటనే ప్రోమోల నుండి మెగాస్టార్ అనే పదాన్ని తీసేశారు. మెగాస్టార్ అభిమానులకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక తప్పిదం వల్లే అలా జరిగింది తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘ఒకే ఒక్క మెగాస్టార్.. మనందరికీ ఇది తెలుసు’ అంటూ వివాదానికి చెక్ పెట్టింది.

Related Articles

Telugu Articles

Movie Articles