ప్రిన్స్ భారతగా శాకుంతలం లో “అల్లు అర్హా”

0
97
Allu Arha Debuting With Samanthas Pan India Film Shaakuntalam

అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే.. అల్లు అర్జున్ – అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే నాల్గవ తరం వారసురాలు, అల్లు అర్జున్ కూతురు అయిన అల్లు అర్హా తన తొలి చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలివుడ్ గా మారింది. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది.

మితాలజికల్ డ్రామా గా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రం కి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్హ.. ఓ కీలక పాత్ర పోషించనుంది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ విషయం పట్ల ఎంతో భావోద్వేగం వ్యక్తం చేస్తూ గుణ శేఖర్ కి మరియు నీలిమ గుణ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం లో దేవ్ మోహన్, అదితి బాలన్, మోహన్ బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.