Allu Arha Role In NTR Devara Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసింది. దీనిలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అలాగే మిగతావారు కూడా మనకు తెలియకుండా ఏదో ఒక సినిమాలో చాలా సార్లు కనపడ్డారు. ప్రస్తుతం వారసత్వ విషయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని (Sithara) అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Allu Arha) రంగ ప్రవేశం చేశారు. సితార ఒక పాటలో కనపడక, అల్లు అర్హ సమంత సినిమాలో కనబడిన విషయం తెలిసిందే.
Allu Arha Role In NTR Devara Movie: ఇప్పుడు వీళ్లు ఇద్దరూ పేర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం సితార జువెలరీ యాడ్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాలో అల్లు అర్హ ముఖ్యమైన పాత్రలో కనబడబోతుంది. ఈ దేవర సినిమాకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతా నటించిన శకుంతల సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించారు.
అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ రాబోయే దేవర సినిమాలో కూడా ప్రత్యేకమైన రోల్ చేస్తుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దేవర (Devara) సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ (Allu Arha) కనిపించబోతున్నట్టు సమాచారం. దీని గాను అల్లు అర్హ కి ఎన్టీఆర్ మేకర్స్ బాగానే రెమ్యూనరేషన్ (remuneration) కూడా ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు అయితే నడుస్తున్నాయి.
దేవర సినిమా మేకర్స్ అల్లు అర్హ కి నిమిషానికి 2 లక్షలు ఇస్తున్నట్టు సమాచారమైతే తెలుస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర కేవలం 10 నిమిషాలు ఉండటంతో ఏకంగా 20 లక్షల రూపాయలు రెమినరేషన్ (remuneration) ఈ వయసులోనే అర్హ (Allu Arha) తీసుకోబోతుంది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొంతమంది అయితే అల్లు అర్జున్ కూతురా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్హ రెండో సినిమాకి ఇంత మొత్తంలో రెమినరేషన్ తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది అంతేకాకుండా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇంకోవైపు సితార కూడా రీసెంట్గా చేసిన జువెలరీ యాడ్ కి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. ఈ వయసులోనే ఇద్దరు ఎంత రెమ్యూనరేషన్ అందుకోవటం చూస్తుంటే ఫ్యూచర్లో హీరోయిన్లుగా కొనసాగడం కాయమేనని తెలుస్తుంది.