allu arjun about Ala Vaikunthapurramuloo movie story
allu arjun about Ala Vaikunthapurramuloo movie story

(allu arjun about Ala Vaikunthapurramuloo movie story) ఈ సంక్రాంతి బరిలో పందెం కోళ్లు నాలుగు తయారయ్యాయి. అల్లు అర్జున్ కథనాయకుడిగా పూజా హెగ్డే కథనాయకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో. ఎన్నో అంచనాల నడుమ విడుదల అవుతున్న రేపు విడుదల అవుతుంది. దర్భార్ తో రజినీ, సరిలేరు నీకెవ్వరు తో మహేష్ బాబు, అల వైకుంఠపురములో తో అల్లు అర్జున్.. ఇక ఎంత మంచివాడవురా తో కళ్యాన్ రామ్ లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్భార్ మూవీతో రజినీకాంత్ తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయారని టాక్ వినిపిస్తుంది. ఈ రోజు సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయ్యింది.. సాయంత్రం వరకు ఈ మూవీ టాక్ ఏంటో తేలిపోతుంది. రేపు అల వైకుంఠపురములో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ఏం మాయ చేస్తారో చూడాలి.

ఈ మూవీలో స్టైలిష్ స్టార్ ట్యాగ్‌కి తగ్గట్టుగానే.. అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్, ఫైట్స్‌ను ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జాబ్ కోసం ట్రై చేసి చేసి ఓ పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేస్తాడు. ఆ పెద్ద కంపెనీకి ఓనర్ అయిన పూజ హెగ్డే కి అసిస్టెంట్ బన్నీ. అయితే బన్నీ ఆత్మాభిమానంకు, మంచికి చాలా విలువ ఇచ్చే వ్యక్తి. ఆస్తులు కంటే విలువైంది బంధాలు అని భావిస్తుంటాడు. రేపు ఈ మూవీ రిలీజ్ సందర్బంగా ఇప్పటికే ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గతంలో త్రివిక్రమ్ నాకు మంచి హిట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆయన చెప్పిన కథ లైన్ నాకు నచ్చడంతో అంత గ్యాప్ తర్వాత ఈ మూవీకి ఓకే చెప్పాను అన్నారు.

ఈ సినిమాలో నా పాత్రను ఆయన చాలా గొప్పగా మలిచాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను ఉద్యోగిగా ఉంటే, నా పైఅధికారిగా పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇక మా ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో కావాలసినంత ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడ సరిలేరు నీకెవ్వరూలనే చాలా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉందట. బన్నీ, మురళి శర్మ మధ్య వచ్చే కామెడీ సినిమాకు చాలా హైలైట్. ఇక సెకండాప్ లో అసలు బన్నీ ఎవరు అనేది ట్విస్ట్. ఎంతో ఉత్కంటకు గురి చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన ల్ సీన్ చాలా హైలైట్ గా ఉన్నాయట. గీత ఆర్ట్స్, హారిక హాసిని బ్యానర్స్ లో చినబాబు – అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్వహించారు.