Allu Arjun Trivikram Ala VaikuntapuramMovie, AA19 Title
Kirak Title For Allu Arjun Trivikram Movie, AA19 Title

‘అల వైకుంఠపురములో’.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ, తన స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు. కాగా ఈ సినిమా టీజర్ ను నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నా ఆ తరువాత మనసు మార్చుకున్నారట. అక్టోబర్ 8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం. బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పైగా ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్, ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.