అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్.. రంగస్థలం ఔట్..

553
allu arjun ala vaikunthapurramuloo 10 days collection
allu arjun ala vaikunthapurramuloo 10 days collection

(allu arjun ala vaikunthapurramuloo 10 days collection, worldwide collections)స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. కాగా మొదటి పది రోజులకు గానూ ‘అల వైకుంఠపురములో’ ప్రపంచవ్యాప్తంగా రూ .220 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అలాగే షేర్ లో చూసుకుంటే 143 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. దీంతో ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ ను కైవసం చేసుకుంది.

10 రోజుల తర్వాత కూడా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో జోరు మామూలుగా లేదు. నైజాంలో అయితే 35 కోట్ల షేర్ దాటేసి 40 కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 112 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 120 కోట్లకు పైగా కలెక్ట్ చేయడానికి దూసుకుపోతుంది అల వైకుంఠపురములో. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే 143 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా 3 మిలియన్ క్లబ్బులో చేరిపోయిన ఈ చిత్రం షేర్ 13 కోట్ల వరకు వసూలు చేసింది.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల వైకుంఠపురములో తొలివారంలోనే బయ్యర్స్ అందర్నీ సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. ఇప్పటికే అంతా లాభాల్లోకి వచ్చేసారు.. రెండోవారం కూడా కుమ్మేసింది ఈ చిత్రం.

‘అల వైకుంఠపురములో’ మొదటి పది రోజుల కలక్షన్ల వివరాలు :

నైజాం-35.69 కోట్లు
సీడెడ్-18.07 కోట్లు
వైజాగ్-18.80 కోట్లు
కృష్ణ -8.80 కోట్లు
గుంటూరు -9.93 కోట్లు
నెల్లూరు -4.07 కోట్లు
ఈస్ట్ -9.89 కోట్లు
వెస్ట్ -7.65 కోట్లు

మొత్తం ఏపి & తెలంగాణ మొదటి పది రోజుల కలెక్షన్స్ -112.90 కోట్లు