allu arjun ala vaikunthapurramuloo cross 3 million mark in usa box office collection
allu arjun ala vaikunthapurramuloo cross 3 million mark in usa box office collection

(allu arjun ala vaikunthapurramuloo cross 3 million mark in usa box office collection) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు చూసి దర్శక నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. నిజంగానే తాము ఇంత గొప్ప సినిమా తీసామా అనుకునేలా అల వైకుంఠపురములో కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తుంది.

ఇంటా బయటా అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఈ చిత్రం కుమ్మేస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా మళ్లీ సత్తా చూపిస్తుంది. కొన్ని రోజులుగా అక్కడ 2 మిలియన్ కూడా చూడటం లేదు మన తెలుగు సినిమా. సైరా, సాహో లాంటి సినిమాలు కూడా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్స్ అయ్యాయి అక్కడ. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం అన్ని లెక్కలు ఒకేసారి సెట్ చేస్తున్నాడు. అల వైకుంఠపురములో ఇప్పటికే అక్కడ 3 మిలియన్ మార్క్ అందుకుంది.

యూఎస్‌లో సోమవారం నాడు ‘అల వైకుంఠపురములో’ సినిమా 3 మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. అల్లు అర్జున్ సినిమా ఈ మార్క్‌ను అందుకోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, త్రివిక్రమ్‌కు కూడా యూఎస్‌లో ఇదే తొలి 3 మిలియన్ డాలర్ మూవీ. యూఎస్‌లో 3 మిలియన్ మార్క్‌ను అందుకున్న ఐదో తెలుగు సినిమా ‘అల వైకుంఠపురములో’.

యూస్‌లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రాల జాబితాలో ‘అల వైకుంఠపురములో’ ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలిస్థానం ‘బాహుబలి 2’దే. ఈ చిత్రం అక్కడ 21 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండో స్థానంలో ‘బాహుబలి’, మూడో స్థానంలో ‘రంగస్థలం’, నాలుగో స్థానంలో ‘భరత్ అనే నేను’ చిత్రాలు ఉన్నాయి. మరి ఫుల్ రన్‌లో ‘అల..’ 3.5 మిలియన్ డాలర్ మార్క్‌ను దాటుతుందో లేదో చూడాలి. ఒకవేళ దాటితే గనుక ‘రంగస్థలం’ను వెనక్కి నెట్టి ‘నాన్-బాహుబలి’ రికార్డును నెలకొల్పుతుంది.

మొత్తానికి అల వైకుంఠపురములో దూకుడు చూస్తుంటే బాపురే అనిపిస్తుంది. ఇక ఇండియాలో కూడా అల వైకుంఠపురములో జోరు మామూలుగా లేదు. నైజాంలో అయితే 30 కోట్ల షేర్ దాటేసి 35 కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడానికి దూసుకుపోతుంది అల వైకుంఠపురములో. మళయాలంలో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల వైకుంఠపురములో తొలివారంలోనే బయ్యర్స్ అందర్నీ సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. పైగా ఇప్పుడు రవితేజ డిస్కో రాజా ఉన్నా కూడా అల వైకుంఠపురములో ధాటికి తట్టుకుని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Top 10 USA Grossers ( Only Reported Rentrak) ( in Millions )

1. Baahubali 2 (Indian Versions) upto $21 Mn Apx All including
2. Baahubali (Indian Versions) – All including $8.46 Mn Apx; Telugu $6.998 Mn Tamil $861K & Hindi $600K Apx (incl Canada)
3. Ala Vaikunthapurramuloo crossed $3 Mn on Jan 20th still loading
4. Rangasthalam $3.513
5. Bharat Ane Nenu $3.416
6. Saaho $3.234
7. Srimanthudu $2.891
8. Sye Raa $2.608
9. Mahanati $2.544
10. Geetha Govindam $2.456