‘అల వైకుంఠపురములో’.. ఫస్ట్ సింగిల్ !

Allu Arjun Ala Vaikunthapurramuloo Movie Songs
Allu Arjun Ala Vaikunthapurramuloo Movie Songs

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ త్వరలో విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను సిడ్ శ్రీరామ్ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారట.

ఇక జూలై 8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. ఆ ప్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఆలాగే బన్నీ స్క్రీన్ ప్రేజన్సీ అద్భుతంగా ఉంటాయట. ఇక ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని ఫిల్మ్ నగర్ టాక్.

బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. అందుకే ఈ సినిమాకి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.