Allu Alrjun Ala Vaikunthapurramuloo movie making video
Allu Alrjun Ala Vaikunthapurramuloo movie making video

(Allu Alrjun Ala Vaikunthapurramuloo movie making video)స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ అల వైకుంఠపురంలో ‘. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, బన్నీ కాంబినేషన్‌లో ‘జులాయి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్‌ కమెడియన్‌ సునీల్‌ చాలారోజుల తర్వాత బన్నీతో కలిసి నటిస్తుండటం విశేషం. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.

స్టార్ హీరోలు మహెష్, అల్లు అర్జున్ పండగపూట అభిమానుల కడుపునింపేస్తున్నారు. వీరి సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా ఒక్కరోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రేపు సరిలేరు రిలీజ్ కానుంది. ఎల్లుండే అల.. రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ వీడియోలు క్యూ కడుతున్నాయి.మహేష్ బాబు సినిమా మేకింగ్ వీడియో నిన్న విడుదల చేయాలా అల్లు అర్జున్ ఈ రోజు అల వైకుంఠపురంలో సినిమా మేకింగ్ వీడియో ని విడుదల చేసారు..

ఈ వీడియోలో సినిమా యూనిట్‌ ఆడుతూ- పాడుతూ, నవ్వుతూ- తుళ్లుతూ ఎంతో సరదా సరదాగా సినిమాను పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో బన్నీ ఎంట్రీ, ఫైటింగ్‌ సీన్లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెట్‌కు వచ్చిన బన్నీ కొడుకు అయాన్‌ ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌ అని అప్పుడే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. షూటింగ్ ఎంత ఫన్నీగా జరిగిందో అర్థమవుతోంది. అల.. సెట్స్ లో విక్టరీ వెంకటేష్ కనిపించారు. ఇక నవ్వులతో దద్దరిల్లుతున్న మేకింగ్‌ వీడియోను చూస్తే థియేటర్‌ నవ్వులతో పేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన అల.. వైకుంఠపురంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. హారికా & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించాయి.