Allu Arjun open up about his bollywood entry
Allu Arjun open up about his bollywood entry

(Allu Arjun open up about his bollywood entry news and upcoming movie latest news) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రెండో వారం కూడా కుమ్మేసింది. కేవలం రెండో వారంలోనే 35 కోట్ల షేర్ వసూలు చేసింది అల వైకుంఠపురములో. రెండు వారాలకు గానూ 144 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా కొత్త ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. నాన్ బాహుబలిలో అన్ని రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు బన్నీ.

ఈ సందర్భంగా తాను బాలీవుడ్‌లోకి వెళ్లే అంశంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. బాలీవుడ్‌లోకి ఎప్పుడు వెళ్తానో తెలియదు. తనకు సరిపోయే, బలమున్న కథలతో బాలీవుడ్‌లోకి వెళితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘గల్లీ బాయ్’ లేదా ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని ఉందని చెప్పుకొచ్చాడు బన్నీ. ‘గజినీ’తో బాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్ల సినిమా ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బన్నీ తన బాలీవుడ్ డెబ్యు చేస్తాడేమో మరి. ఇకపోతే.. బన్నీ రిక్వైర్మెంట్ మేరకు ఆ తరహా కథలతో బాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా బన్నీని అప్రోచ్ అవుతారో లేదో కూడా చూడాలి.