షూటింగ్ లో ఎప్పుడు బిజీగా ఉండే అల్లు అర్జున్ కొంచెం గ్యాప్ దొరికిన తన ఫ్యామిలీ మెంబర్స్ తో వెకేషన్ కి వెళ్ళటం అలాగే కొంత సమయం వాళ్ల కోసం కేటాయించడం చేస్తూ ఉంటారు. అలాగే అల్లు అర్జున్ తన అల్లు అర్హ సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు తన ఫాలోవర్స్ కోసం షేర్ చేస్తూ ఉంటారు. అలాగే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండి ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటారు.
అలాగే ఇప్పుడు స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అల్లు అర్హ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోలో.. సోఫాలో కూర్చున్న అల్లు అర్జున్.. యోగాసనాలు వేస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతున్నారు. అర్హ ఆ యోగా భంగిమ చేస్తుండగా, పక్కన ఉన్న అల్లు అర్జున్ చూసి షాక్ అయిన చిత్రం కనిపిస్తుంది.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ ఉగాదికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే పుష్ప 2 టీజర్ ని అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధం చేసినట్టు సమాచారం తెలుస్తుంది.
Good Morning 🌞 pic.twitter.com/HmSSdun8pg
— Allu Sneha Reddy (@AlluSnehaReddy_) March 21, 2023