అల్లు అర్జున్-కొరటాల శివ సినిమా అప్డేట్

486
Allu Arjun and Koratala Siva Movie Story Concept
Allu Arjun and Koratala Siva Movie Story Concept

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ కోసం తెగ కష్టపడుతున్నారు. తన తాజా చిత్రం పుష్పతో ఎలాగైనా పాన్ ఇండియాకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే అర్జున్ ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే తన తదుపరి సినిమాను ఓకే చేశారు. తన తర్వాతి సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నట్లు ప్రకటించారు.

 

 

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబోలో రానున్న సినిమా చిత్రసీమలో హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్, విలన్ అంటూ ఇలా ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కాన్స్‌ప్ట్ గురించి ఓ వార్త కూడా హల్‌చల్ చేస్తోంది.

 

 

ఇప్పటి వరకు కొరటాల శివ చేసిన ప్రతి సినిమా కూడా సమాజానికి ఓ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా ఓ మెసేజ్ ఇస్తుందంట. ఈ సినిమాలో మంచి నీటికి సంబంధించిన అంశంపై కథ నడుస్తోందని టాక్ నడుస్తోంది.

 

ఈ మెసేజ్ స్ట్రాంగ్ ఇవ్వాలని అదే స్థాయి స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంట. సినిమా ఎప్పుడు మొదలైనా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.