Allu Arjun and director Krish movie poster leaked from production house, Allu Arjun new movie under Krish direction after Pushpa 2, Director Krish next movie,
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత డైరెక్ట్ గా త్రివిక్రమ్ మూవీ చేయటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.. కాకపోతే మధ్యలో దర్శకుడు అట్లీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు అయితే నడుస్తున్నాయి.. కానీ అనూహ్యంగా ఈరోజు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు ఒక పోస్టర్ అయితే లీక్ అయింది.
ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తున్న విషయం తెలిసిందే.. కానీ సినిమా మొదలుపెట్టి రెండేళ్లు అవుతున్నా కూడా ఇంతవరకు షూటింగ్ పూర్తికాలేదు.. ఇంతలోనే అల్లు అర్జున్ సినిమా తెరపైకి రావటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే విడుదలైన పోస్టరు హిందీ టైటిల్ కభి అప్నే కభి సప్నే ఉండటం అందరికీ మరొక ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.

Allu Arjun – Krish Movie: మరి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత డైరెక్ట్ గా హిందీలో సినిమా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారా.. అంటూ కొంతమంది ట్రేడ్ పీపుల్ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. అల్లు అర్జున్ కూడా డైరెక్ట్ గా హిందీ సినిమా చేసి ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ మరింత పెంచుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఏది ఏమైనా సరే క్రిష్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా రావటం అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
Allu Arjun – Krish Movie: వీళ్లిద్దరి కాంబినేషన్లో అంతకుముందే వేదం అనే సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హీట్ గా నిలిచింది కాకపోతే ఈ సినిమాలో మనోజ్ కూడా నటించడం జరిగింది. . ఇక అల్లు అర్జున్ పుష్పటు సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో షూటింగు సర్వేగంగా జరుగుతుంది. ఈ సినిమాని ఆగస్టు 2024 విడుదల చేస్తున్నట్టు మేకర్స్ కూడా డేట్ ని ప్రకటించారు.