‘పుష్ప’కు విలన్ గా మంచువారబ్బాయి మనోజ్ ?

1607
allu arjun and manchu manoj act together again for pushpa movie

‘వేదం’… ఈ సినిమా చూసినవారికి అందులో కేబుల్ రాజుగా నటించిన అల్లు అర్జున్, రాక్ స్టార్ గా యాక్ట్ చేసిన మంచు మనోజ్ పాత్రలు గుర్తు రావటం ఖాయం. ఆ తర్వాత ఏ సినిమాలోనూ వారిద్దరూ కలసి నటించలేదు. బన్నీ వరుస హిట్స్ తో టాప్ స్టార్ గా ఎదగగా… మనోజ్ తక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఎవరి రూట్ లో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

బన్నీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా విశేషం సంతరించుకున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటులు కీలకమైన పాత్రల కోసం ఎంపికయ్యారు. కానీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. దాని వల్ల అందులో నటించాల్సిన విజయ్ సేతుపతి డేట్స్ లేవని తప్పుకున్నాడు. ఇప్పటికీ ఆ పాత్ర ఎవరు చేస్తారనే క్లారిటీ రాలేదు.

అది ఇప్పుడు మంచు వారి వారసుడు మంచు మనోజ్ దగ్గర ఆగింది. ఇప్పుడు విలన్ గా మంచు మనోజ్ ఫైనల్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. నిజంగా అదే నిజమైతే సినిమాపై మరింత ఆసక్తి పెరగటం ఖాయం. చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మీ’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి బన్నీతో కలసి మనోజ్ నటించే విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో.. ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘పుష్ప’ కి పాన్ ఇండియా స్థాయిలోనూ మంచి క్రేజ్ నెలకొంది.