Allu Arjun And Rashmika Mandanna To Commence Shooting For Pushpa From November 10

Allu Arjun Pushpa Shooting: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్ రీ ఓపెన్ కావడంతో ఒక్కొక్కరుగా స్టార్ హీరోలంతా సెట్స్ పైకి వస్తున్న నేపథ్యంలో తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆతృతగా ఎదురు చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించి ఇదివరకే అల్లు అర్జున్ లేకుండానే కొన్ని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా..కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. పుష్ప సన్నివేశాల చిత్రీకరణ కేరళలో చేసేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకోగా ఇప్పటి కరోనా పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో తెలంగాణలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిపేందుకు దర్శకుడు సుకుమార్ నిర్ణయించారు. దీనికోసం అటవీ ప్రాంతంలో కొన్ని సెట్స్ సిద్ధం చేశారు. ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన స్పెషల్‌ గ్లిమ్స్‌ వీడియో రిలీజ్ చేసి ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి (నవంబర్ 10) మొదలు కానుందని తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో దర్శకుడు సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్, ఇతర యూనిట్ సభ్యులు తమ తమ పనుల్లో నిమగ్నమై కనిపించారు.

చిత్రీకరణకు అంతా రెడీ కావడంతో శనివారం రాత్రి అల్లు అర్జున్ మారేడుమిల్లి చేరుకున్నారు. ఇక్కడి హెచ్ఎన్టీసీ ఫారమ్ వద్ద ఇటీవల నిర్మించిన ‘ది ఉడ్స్’ కాటేజీల్లో బస చేశారు. సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఓ బస్సునూ హైదరాబాద్ నుంచి తెప్పించారు. అటవీ ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు సుకుమార్. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండాగా, ఆయన సరసన రష్మిక మందాన పల్లెటూరి వేషాధారణతో ఆకట్టుకోనుందట.