Allu Arha: కూతురి యాక్టింగ్‌ చూసి మురిసిపోయిన అల్లు అర్జున్‌!

0
55
Allu arjun and Sneha enjoys Arha acting on Shakuntala film shooting sets

Allu Arha: తన ముద్దుల కూతురు అల్లు అర్హ నటన చూసి అల్లు అర్జున్‌ దంపతులు మురిసిపోయారు. డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ చిత్రంలో అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్కినేని సమంత ప్రధానపాత్ర పోషిస్తుండగా.. ఓ కీలకపాత్రలో అర్హ కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

అర్హ ఈ చిత్రంలో బాల నటిగా నటిస్తోంది. అర్హకి తొలి పరిచయ చిత్రం కావడంతో తన రోల్ కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉందిట. ఈ నేపథ్యంలో అర్హ రెగ్యులర్ గా శాకుంతలం షూటింగ్ కి హాజరవ్వాల్సిన సమయం వచ్చింది. దర్శకుడి నుంచి అర్హకి పిలుపు రావడంతో షూటింగ్ కి రెడీ అయింది. కాగా.. తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్ని-స్నేహ దంపతులు ‘శాకుంతలం’ సెట్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే అర్హ నటన చూసిన బన్ని తెగ మురిసిపోయాడు.

ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గారాల కుమార్తె కోసం బన్నీ పాల్కాన్ ని కేటాయించారు. అర్హకి షూటింగ్ ఉన్నంత కాలం పాల్కన్ తన వద్ద ఉండాలని బన్నీ ఆదేశాలు ఇవ్వడంతో పాల్కన్ ఇప్పుడు అర్హ అండర్ లో ఉంది. ఫాల్కాన్ అర్హతో లేకపోతే సెట్స్ లో ఇబ్బంది పడుతుందని భావించి బన్నీ అన్ని సౌకర్యాలు ఉన్న తన కారవ్యాన్ ని కుమార్తెకు కేటాయించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

Photos : Allu Arjun & Sneha On Shaakuntalam Sets