Allu Arjun and Trivikram New Movie: పుష్ప చిత్రం తర్వాత ఊహించని మాస్ క్రేజ్ సంపాదించి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2 shooting) షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ముచ్చటగా నాలుగోసారి మూవీ చేయబోతున్నట్లు టాక్. ఇంతకుముందు వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
Allu Arjun and Trivikram New Movie: భారీ అంచనాల మధ్య జరుగుతున్నటువంటి పుష్ప2 షూటింగ్ సెలవేగంగా పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వేర్ ఇస్ పుష్ప అంటూ రిలీజ్ అయిన వీడియో పెద్ద సెన్సేషన్ ని సృష్టించింది. అలాగే తిరుపతి గంగ జాతర నేపథ్యంలో అల్లు అర్జున్ విచిత్ర వేషధారణ పిక్ చిత్రంపై మంచి హైప్ను సృష్టించింది. ఈ చిత్రంలో పుష్ప పార్ట్ వన్ కంటే కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో పుష్ప 2 ఉండబోతుందట.
గతంలో అల్లు అర్జున్ (Allu Arjun) మరియు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో జులాయి ,సన్ ఆఫ్ సత్యమూర్తి ,అలవైకుంఠపురం సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం జులాయి బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ దగ్గర నుంచి కామెడీ వరకు ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. అలాంటి ఈ కాంబినేషన్లో మరోసారి నాలుగవ చిత్రం త్వరలో మొదలు కాబోతోంది.

ఈ మూవీలో బన్నీ పక్కన భీమ్లా నాయక్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ మూవీ సెక్స్ పైకి వస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రంతో పాటుగా అల్లు అర్జున్ రేసుగుర్రం తర్వాత తిరిగి మరోసారి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఇంకో మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలబడుతుంది.