అనాథ బాలుడికి అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ క్రిస్మస్ గిఫ్ట్..!

0
389
Allu Arjun and Vithika Sheru surprise Christmas Gift To Orphan Fan Boy

సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన చిన్నారి అభిమానికి ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు. ఓ చిన్నారికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సంతోషంలో ముంచేశాడు.వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ఇటీవల ఒక అనాథాశ్రమానికి వెళ్లారు. క్రిస్మస్ పండగకు పిల్లలకు ఎలాంటి బహుమతులు కావాలంటూ ఒక వీడియో షూట్ చేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా అనాథ శరణాలయంలో సమీర్ అనే చిన్నారి కోరిక తీర్చాలని అనుకున్నారు.

సమీర్‌కు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.ఈ క్రిస్మస్ కు గిఫ్ట్ గా తనకు అల్లు అర్జున్ ఆటో గ్రాఫ్ కావాలని అడిగాడు. అదే తనకు అసలైన బహుమతి అన్నాడు ఆ బాలుడు. అతను ఈ విషయాన్ని చెప్పినప్పుడు వీడియో తీసి దాన్ని ట్విట్టర్‌లో పెట్టి అల్లు అర్జున్‌ను రిక్వెస్ట్ చేశారు వితిక, నోయల్. వీరి రిక్వెస్ట్‌కు స్పందించిన అల్లు అర్జున్.. తన వీరాభిమాని కల నెరవేర్చి శాంతా క్లాజ్ అయ్యాడు. తన కుమారుడు అల్లు అయాన్‌తో తన ఆటోగ్రాఫ్‌ను పంపి సమీర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ విషయాన్ని వితిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయాన్ అనాథ శరణాలయానికి వచ్చి బన్నీ ఆటోగ్రాఫ్ చేసిన పేపర్‌‌ను సమీర్‌కు ఇచ్చిన వీడియోను వితిక షేర్ చేశారు. తన తండ్రి పంపిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను కూడా సమీర్‌కు ఇచ్చాడు అయాన్. దీంతో ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ‘థ్యాంక్యూ బన్నీ అన్నా’ అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా క్రిస్మస్ ట్రీని అలంకరించి మురిసిపోతున్న అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేవారు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాాయి. ఈ విధంగా ఇప్పటి నుంచే అల్లు పిల్లలు ట్రెండింగ్ లో ఉంటున్నారు.

 

Previous articleVikram’s Second Look Poster From Cobra Goes Viral
Next articleShraddha Kapoor Latest Photos