పొలిటికల్ లీడర్ గా అల్లు అర్జున్?

0
341
Allu Arjun as a political leader with Koratala siva next movie

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ లీడర్స్ గా టాలీవుడ్ హీరోలు కనిపించడం చాలా తక్కువ. గతంలో సీనియర్ హీరోలు కొందరు పొలిటికల్ లీడర్స్ గా అలరించినప్పటికీ.. యంగ్ హీరోలు మాత్రం ఆ జోనర్ లోని సినిమాల్ని చాలా తక్కువ గా టచ్ చేశారు. అయితే త్వరలోనే అల్లు అర్జున్ పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ సినిమాకి కొరటాల శివ దర్శకుడు అవడం మరో విశేషం. బన్నీ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.

మొన్నీ మధ్య బన్నీ, కొరటాల కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల చేయబోయే సినిమా అదే. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా నేపథ్యానికి సంబంధించి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

కొరటాల శివ సినిమాలో మాత్రం బన్నీ యువ రాజకీయ నేతగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో బన్నీ నటించిన ‘రేసు గుర్రం’ సినిమా పాలిటిక్స్ బేసేడ్ మూవీ అయినప్పటికీ అందులో అతను పొలిటికల్ లీడర్ గా నటించలేదు. స్టూడెంట్స్ పాలిటిక్స్, పేదరికం, నిరక్షరాస్యత లాంటి అంశాలతో కూడిన ఒక సామాజిక సందేశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.

ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఈ చిత్రం మంచి కాన్సెప్ట్ తో రాబోతోందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపించేది నిజమే అయితే ఇలాంటి పాత్రలో ఆయన్ని చూసే ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పవచ్చు. ఆచార్య సినిమా పూర్తి కాగానే.. కొరటాల ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ ప్రారంభిస్తాడట. మరి నిజంగానే కొరటాల శివ సినిమాలో బన్నీ పొలిటికల్ లీడర్ అవతారంలో కనిపిస్తాడేమో చూడాలి. ఏదేమైనా ఇందులో అల్లు అర్జున్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొరటాల శివ మార్క్ మేసేజ్ కూడా ఉంటుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here