Homeసినిమా వార్తలుట్విట్టర్ లో హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..!!

ట్విట్టర్ లో హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..!!

Varudu heroine comments on Allu Arjun viral on social media. Bollywood heroine Bhanu Sri Mehra viral comments on pushpa 2 star Allu Arjun, Heroine Bhanu Sri Mehra twitter account block by Allu Arjun.

అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష ఇండస్ట్రీలోనూ టాప్ హీరోల్లో ఒకరిగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాతో తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మీద తనతో పని చేసిన హీరోయిన్ కామెంట్స్ చేయటం జరిగింది.

ఇప్పుడు ఆ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ఎప్పుడూ తన సహన నటీనటులతో క్లోజ్ గా ఉండటమే కాకుండా తన సినిమాల్లో స్టోరీలు బట్టి వాళ్లకి అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారు. వరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ఇప్పుడు ఈ హీరోయిన్ ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్లో బ్లాక్ చేయటం జరిగింది.

Pushpa 2 star Allu Arjun block heroine Bhanu Sri Mehra twitter account

దీనికి సంబంధించిన ఫోటోలను స్క్రీన్ షాట్స్ లాగా తీసి హీరోయిన్ భాను శ్రీ తన ట్విట్టర్ ఎకౌంట్లో షేర్ చేయడం జరిగింది. వరుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగలటంతో భాను శ్రీ కి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. అంతేకాకుండా కొన్ని తెలుగు మరియు తమిళ చిత్రాలతో పాటు అనేక పంజాబీ చిత్రాలలో నటించింది కానీ అవేవీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేదు.

అసలు అల్లు అర్జున్ ఈ హీరోయిన్ ని బ్లాక్ చేయటానికి కారణాలు చూస్తే.. గత కొంతకాలంగా అవకాశాలు లేకపోయేటప్పుడికి భాను శ్రీ ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తుంది. వ్యూస్ అలాగే సబ్‌స్క్రయిబ్ కోసం భాను శ్రీ తను చేసిన వీడియోలని ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా టాప్ హీరోలందరికి ట్యాగ్ చేసేది. అందువల్లే అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసినట్టు అర్థమవుతుంది.

- Advertisement -

దీనికి హీరోయిన్ భాను శ్రీ ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ చేయటం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే కొంత సమయం తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తన అకౌంట్ ని అన్ బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇది చూసిన భాను శ్రీ తనని విమర్శించొద్దు అంటూ మరో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.

Varudu heroine comments on Allu Arjun viral on social media. Bollywood heroine Bhanu Sri Mehra viral comments on pushpa 2 star Allu Arjun, Heroine Bhanu Sri Mehra twitter account block by Allu Arjun.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY