మాస్‌ జాతర రికార్డు దిశగా “పుష్ప” సాంగ్.!

0
891
Allu Arjun Dakka Dakka Mukka song record views

Daakko Daakko Meka Song: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రెండు భాగాలుగా సిద్ధం కానున్న ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నారు. “పుష్ప” ది రైజ్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ని పాన్ ఇండియన్ లెవెల్లో మొత్తం 5 భాషల్లో మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ పాటలో అల్లు అర్జున్ లారీ నడపడం.. గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తుండటం వంటివి చూపించారు. అల్లు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఈ పాటకు థియేటర్లలో పునకాలే అని కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతానికి ఆల్రెడీ రికార్డు బ్రేకింగ్ వ్యూస్ మన తెలుగులో రాబట్టేసి 8 మిలియన్ మార్క్ ని చేరుకుంది. దక్షిణాదిన మాస్టర్ కుట్టి స్టోరీ సాంగ్ ఇప్పటి వరకు 8.26 మిలియన్ వ్యూస్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ఇపుడు మరి పుష్ప సాంగ్ దానిని బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు సెట్ చేస్తుందో లేదో చూడాలి.

Pushpa part 1 Dakka Dakka Mukka song record views

‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – రావు రమేష్ – అజయ్ ఘోష్ – అనసూయ భరద్వాజ్ – ధనుంజయ్ – అజయ్ – శత్రు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Click Hear For Daakko Daakko Meka Song

 

Previous articleDaakko Daakko Meka Song From Allu Arjun Pushpa
Next articleరివ్యూ: ఒరేయ్ బామ్మ‌ర్ది: అక్క‌డ‌క్క‌డా అల‌రించే ‘బావాబామ్మ‌ర్దులు’