మారేడుమిల్లిల్లో అర్హ పుట్టినరోజు వేడుకలు..!

0
223
Allu Arjun Daughter Arha Birthday Celebration Held In Pushpa Sets

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హకు తన నాలుగో పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మన్యంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్​లో ఉన్న అల్లు అర్జున్..​ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో పాల్గొన్నారు… ఈసారి మాత్రం డెస్టినేషన్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అందులోనూ మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతంలో. అల్లు అర్హ నాలుగో పుట్టినరోజు వేడుకలు నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరిగాయి.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమైంది. 15 రోజులుగా మారేడుమిల్లి మన్యంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా.. పుట్టినరోజు వేడుకలను అక్కడే చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లు అర్జున్ ట్విట్టర్​లో ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోగా.. ఇప్పుడు అందరికీ తెలిసింది.

తన కుమార్తె పుట్టినరోజును ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు గాను ‘పుష్ప’ నిర్మాతలకు బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను కూడా పొందుపరిచారు. ‘‘అర్హ పుట్టినరోజు సందర్భంగా మాకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారికి కృతజ్ఞతలు. ఆతిథ్యం అదిరిపోయింది’’ అని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here