Allu Arjun, Trivikram, Film News, Tollywood Movie news
Allu Arjun, Trivikram, Film News, Tollywood Movie news

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా సెల్ఫ్ మేడ్ హీరోగా తనకంటూ సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సాధించుకుని అసాధారణ విజయాలు అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.అయితే నా పేరు సూర్య ప్లాప్ బన్నీ కెరీర్ కి భారీ స్పీడ్ బ్రేకర్ లా నిలిచింది.

ఫస్ట్ టైం బన్నీ సినిమాకి భారీ నష్టాలు అనే పాయింట్ దగ్గరినుండి మొదలుపెట్టి అల్లు అర్జున్ కంఫర్ట్ జోన్ ఏంటి?,పాత తరహా సినిమాలు తప్ప కొత్త తరానికి నచ్చే సినిమాలు తీయడా?…ఇలా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.దాంతో తన కొత్త సినిమా స్టార్ట్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకుని త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ చేసాడు.బన్నీ-త్రివిక్రమ్ ల సినిమా ఫస్ట్ షెడ్యూల్ నుండే కాస్త బన్నీ బిహేవియర్ తేడాగా ఉంది అని టాక్ వినిపిస్తుంది.ఎట్టకేలకు ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ లోకి వెళ్ళింది.దాంతో బన్నీ తనకు బాగా నచ్చిన ఐకాన్ సినిమాని కూడా త్రివిక్రమ్ సినిమాతో పేరలల్ గా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఇంకా సుకుమార్ కథ చెక్కడం పూర్తికాలేదు.అందుకే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ గా ఉన్న ఐకాన్ పట్టాలెక్కిస్తున్నాడు.త్రివిక్రమ్ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కే ఐకాన్ 2020 సమ్మర్ సీజన్ కి వస్తుంది.అలా ఇప్పుడు ఏర్పడిన గ్యాప్ ని నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ.నిజానికి సుక్కు డేర్ చేస్తే 2020 లో బన్నీ మూడు సినిమాలు రిలీజ్ చెయ్యొచ్చు.కానీ అది జరగని పని అందుకే సుక్కు సినిమా 2021 సంక్రాంతికి అని అంటున్నారు.మొత్తానికి బన్నీ తన ఫ్యాన్స్ గురించి బాగానే ఆలోచిస్తున్నాడు.ఆ రెండు సినిమాలు హిట్ అయితే బన్నీ మళ్ళీ రేస్ లోకి వచ్చేసినట్టే.