చీకటిని సైతం లెక్కచేయని అల్లుఅర్జున్ అభిమానులు

0
81
allu-arjun-fans-at-Rampachodavaram-Junction
allu-arjun-fans-at-Rampachodavaram-Junction

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. స్టైలిష్‌స్టార్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన్ని ఆరాధించే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.

 

 

ఈ క్రమంలోనే బన్నీ షూట్‌ ఎక్కడా జరిగినా అభిమానులు భారీ సంఖ్యలో లొకేషన్‌కు చేరుకుంటున్నారు. కాగా, గతేడాది ‘అల.. వైకుంఠపురములో..’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అల్లుఅర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నారు.

 

 

తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా షూట్‌లో గత కొన్నిరోజుల నుంచి బన్నీ పాల్గొంటున్నారు. దీంతో ఆయన్ని చూడడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లొకేషన్‌కు వెళ్తున్న బన్నీ కారును ఆపిన కొంతమంది గిరిజనులు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన షూట్‌ కోసం తూర్పుగోదావరిలోని రంపచోడవరం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బన్నీని కలిశారు.

 

చిమ్మచీకట్లను సైతం లెక్కచేయకుండా తనని చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి ఆనందించిన బన్నీ వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

 

Previous articleలీకైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సాంగ్ షూటింగ్
Next articleఆచార్యలో కీలక పాత్ర వెయ్యబోతున్న కిచ్చ సుదీప్