అల్లు అర్జున్ ను వదలని ఆ నలుగురు..!

462

అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు. అభిమానుల కేక్ కటింగ్ లు, పార్టీలు ఇలా ఫుల్ జోష్ లో సాగుతుంది. కానీ లాక్ డౌన్ కారణంగా బన్నీ ఈరోజు తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, ఆర్హ తో గడుపుతూ ఉన్నాడు. అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కోశాడు అల్లు అర్జున్.

Image

కానీ ఓ నలుగురు మాత్రం అల్లు అర్జున్ ను విష్ చేయకుండా ఉండలేకపోయారు. గత 19 సంవత్సరాలుగా ప్రతి పుట్టినరోజు నాడు ఎస్.కె.ఎన్. అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నాడు. ఈసారి కూడా అక్కడి వెళ్లానని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ టీమ్ కు చెందిన శ్రీనివాస్(ఎస్.కె.ఎన్), పి.ఆర్.ఓ. శీను.. ఇంకో ఇద్దరు కలిసి అల్లు అర్జున్ ఇంటి దాకా వెళ్లారు. లాక్ డౌన్ సమయంలో అక్కడికి వెళ్లి అల్లు అర్జున్ కు దూరంగా ఉండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అల్లు అర్జున్ అక్కడెక్కడో కొన్ని అడుగుల దూరంలో ఉండగా.. సెల్ఫీలు తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు సామాజిక దూరం పాటిస్తూ.. శుభాకాంక్షలు తెలిపామని వారు చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో వీరి గురించి పోస్టు పెట్టాడు. నా పిల్లర్స్ అంటూ ఆయన వారితో వీడియో కాలింగ్ చేసిన స్క్రీన్ షాట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు.