ఓ వైపు పుష్ప.. మరోవైపు ‘ఐకాన్’

462
Allu Arjun Icon Movie latest poster

అల్లు అర్జున్ అభిమానులకు ఈ రోజు డబుల్ గుడ్ న్యూస్ లు వినిపించాయి. అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడంటూ కొద్దిరోజుల కిందట వార్తలు వినిపించాయి. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించబోయే సినిమా ఇదేనని అందరూ చెప్పుకొచ్చారు. కానీ బన్నీ సుకుమార్ తో జత కట్టాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈరోజు వచ్చింది. సినిమా పేరు ‘పుష్ప’ గా కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి సమయంలో మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. అదే అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా..!

ఐకాన్ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో సినిమా ఆగిపోలేదని గుర్తు చేసింది చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఐకాన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ చేస్తున్నాడు. వకీల్ సాబ్ విడుదలైన తర్వాత.. బన్నీ పుష్ప షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఐకాన్ షూటింగ్ మొదలుకానుంది.

‘పుష్ప’ సినిమా టైటిల్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. అలాగే గంధపు చెక్కల దొంగతనం చేస్తూ దొరికిపోయిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పుష్ప పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.