Allu Arjun praises Karuna Kumar Palasa 1978, says Wonderful attempt with a great underlying message

Allu Arjun: సామాజికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో కళ్లకుకట్టినట్లు తెరపై చూపించిన సినిమా పలాస 1978. ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా థియోటర్లలో విడుదలైంది. అయితే…ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రక్షిత్‌, నక్షత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శ్రీకాళం జిల్లాల్లోని పలాసనలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

అయితే.. స్టైలీస్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ఈ సినిమా దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పలాస మూవీ తనకు ఎంతగానో నచ్చిందని బన్నీ పేర్కొన్నాడు. తాను సినిమా చూశానని…వ్యక్తిగతంగా ఎంతో నచ్చిందని, గొప్ప అంతర్లీన సందేశంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ట్విట్టర్‌ లో తెలిపాడు బన్నీ. నాటి సమాజంలో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించాడు. ముఖ్యంగా సంగీత దర్శకుడు రఘు కుంచె సమకూర్చిన పాటలు చిత్రానికి హైలట్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని చూసిన మర్నాడు దర్శకుడిని కలిసి అభినందించినట్లుగా బన్నీ చెప్పాడు.