చిరంజీవి తర్వాత అల్లు అర్జునే మెగాస్టార్..!

0
467
allu arjun is future megastar Ram gopal varma comments

Allu Arjun Magastar: రాంగోపాల్ వర్మ.. ఈ పేరు తెలియనివారు ఇండస్ట్రీలో ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వర్మ ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నారు. ఎప్పుడూ ఏదొక సంచలన మూమెంట్ తో సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాడు.

తాను మెగా ఫ్యామిలీ కి పెద్ద అభిమానిని అంటూనే రాంగోపాల్ వర్మ చిరంజీవి మరియు ఇతర మెగా హీరోలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొన్న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా కుటుంబం అంతా ఎంతో ఆహ్లాదంగా హాజరయ్యి పాల్గొన్న ఈ వేడుకల్లో బన్నీ మిస్సవ్వడం ఎప్పుడూ డౌట్స్ తో ఉండే వాళ్ళకి మరో రసవత్తర ప్రశ్నగా నిలిచింది. మరి దీనికి మరింత ఆద్యం పోస్తూ పలు సంచలన ట్వీట్స్ పెట్టడం స్టార్ట్ చేసాడు ఆర్జీవీ.

RGV Viral Comments on Allu Arjun

“ఒరిజినల్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఒకే ఒక్క ప్రజెంట్ మెగాస్టార్ అల్లు అర్జున్ మాత్రమే,” అని రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉన్నట్టుండి బన్నీ పైన అంత ప్రేమ ఎందుకు కలిగింది అంటూ అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అయితే సమయం సందర్భం లేకుండా వర్మ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.

అయితే ఎప్పుడూ రకరకాల ట్వీట్స్ పెట్టే వర్మ గత కొన్నాళ్ల కితం అల్లు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ ఏదో సినిమా చేస్తా అని సెన్సేషన్ రేపిన సంగతి తెలిసిందే.